Kishan Reddy: దేశాభివృద్ధికే వన్ నేషన్ వన్ ఎలక్షన్
ABN , Publish Date - May 19 , 2025 | 04:02 AM
దేశాభివృద్ధికి ఒకే దేశం ఒకే ఎన్నిక (వన్ నేషన్ వన్ ఎలక్షన్) కీలకమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజలంతా చర్చించి చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ విధానమే కాదు.. ప్రజలందరి అంశం
భావి తరాల కోసం సంస్కరణలు అవసరం
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధికి ఒకే దేశం ఒకే ఎన్నిక (వన్ నేషన్ వన్ ఎలక్షన్) కీలకమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజలంతా చర్చించి చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని హోటల్ కత్రియాలో ఆదివారం.. ఒకే దేశం ఒకే ఎన్నిక - దేశవ్యాప్త అవగాహన’ అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. దేశానికి స్వాతం త్య్రం వచ్చి 76 ఏళ్లయినా, మనం ఇంకా బ్రిటిష్ విధానాలనే అనుసరిస్తున్నామని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం సంస్కరణలు తేవాల్సి ఉందన్న కిషన్ రెడ్డి.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశానికి అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పటికే కొన్ని చట్టాలను మార్చామని, కానీ కొందరు చట్టాల మార్పిడికి నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు. విభిన్న సమయాల్లో ఎన్నికల నిర్వహణ వల్ల దేశమంతా నిరంతర రాజకీయ చర్చలతో అనేక పని గంటలు వృధా అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకేసారి ఎన్నికలతో పాలనపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుందని పేర్కొన్న కేంద్ర మంత్రి.. ఇది ప్రజా ఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు. భావి తరాలకు మంచి దేశాన్నందించాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవసరమని, దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఇది కేవలం ప్రభుత్వ విధానం మాత్రమే కాదని, దేశ ప్రజలందరి అంశమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సభలూ సమావేశాల్లో కూర్చుని మాట్లాడటానికి పరిమితం కాకుండా ప్రజల్లోకి చైతన్యం కలిగించాలన్నారు. జీఎస్టీ, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, సీఏఏ వంటి పలు సంస్కరణలను ప్రధాని మోదీ పట్టుదలతో సాధించరని కిషన్ రెడ్డి చెప్పారు. కేవలం పదవుల కోసం ఆలోచించే వారికి సంస్కరణలు తేవడం సాధ్యం కాదని, దేశం గురించి మాట్లాడే మోదీకే సాధ్యమని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై మోదీ సర్కారు తీసుకున్న కఠిన నిర్ణయాలను వివరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేవలం సంతాపం ప్రకటించి ఊరుకోలేదని, ఆపరేషన్ సిందూర్‌తో ప్రతీకారం తీర్చుకుందని వెల్లడించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై విపక్షాలు రాద్ధాంతం చేశాయని ఆరోపించారు. కానీ, యావత్ ప్రపంచం భారత్ వైపు చూసేలా మోదీ సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన
Fire Accident: పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత
For Telangana News And Telugu News