Old Adilabad Collectorate Roof Collapses: కుప్పకూలిన ఆదిలాబాద్ కలెక్టరేట్ పైకప్పు
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:47 AM
అది నిత్యం అధికార యంత్రాంగం బిజీబిజీగా గడిపే కలెక్టరేట్. నిజాం కాలం నాటి భవనం కావడంతో శిథిలావస్థకు చేరుకున్నది....
ఇటీవలి వర్షాలకు తడిసిన నిజాం కాలం నాటి భవనం
ఘటనా సమయంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి
జూపల్లి సమీక్ష.. సురక్షితంగా బయటపడ్డ మంత్రి, అధికారులు
ఆదిలాబాద్ టౌన్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అది నిత్యం అధికార యంత్రాంగం బిజీబిజీగా గడిపే కలెక్టరేట్. నిజాం కాలం నాటి భవనం కావడంతో శిథిలావస్థకు చేరుకున్నది. దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తడిసిన భవనంపై అంతస్తు (ఏఓ చాంబర్ నుంచి మూత్రశాలల వరకూ).., బాల్కనీ స్లాబ్ గురువారం సాయంత్రం కుప్పకూలడంతో అధికారులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాయంత్రం సమయంలో ఘటన జరగడంతో ప్రజలెవరూ లేక పోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. అదే సమయంలో కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహిస్తున్నప్పుడు స్లాబ్ కూలడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్లాబ్ నెమ్మదిగా కూలుతుండటంతో యంత్రాంగం ప్రాణాలరచేత పట్టుకుని ప్రత్యామ్నాయ మార్గం ద్వారా బయట పడ్డారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పాత కలెక్టరేట్ శిథిలావస్థకు చేరుకోవడంతో న్యూ హౌజింగ్ బోర్డు పరిధిలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన నూతన కలెక్టరేట్ భవన పనులు కొనసాగుతున్నాయి. కనుక కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో బయటపడ్డ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్.. రూ.1000 కోట్ల దోపిడీ
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసింది.. కేటీఆర్ ఫైర్
For More TG News And Telugu News