Fraud in Armoor : ఆశ పెట్టి.. ఆచూకీ లేకుండా పోయాడు
ABN , Publish Date - Aug 01 , 2025 | 03:16 PM
జిల్లా కేంద్రంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ముందస్తు ఆర్డర్స్ ఇచ్చిన వారికి 40 శాతం డిస్కౌంట్ అంటూ అడ్వాన్స్ వసూలు చేసి బోర్డు తిప్పేసారు ఓ ట్రేడర్స్ షాపు.
ఆర్మూర్ : జిల్లా కేంద్రంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ముందస్తు ఆర్డర్స్ ఇచ్చిన వారికి 40 శాతం డిస్కౌంట్ అంటూ అడ్వాన్స్ వసూలు చేసి బోర్డు తిప్పేసారు ఓ ట్రేడర్స్ షాపు యజమాని. నిజాంసాగర్ మెయిన్ రోడ్డు పక్కన నూతనంగా తిరుమల ట్రేడర్స్ అనే షాపు ఏర్పాటైంది. కొత్తగా పెట్టిన షాపు కావడంతో యజమాని లేనిపోని మాయమాటలు చెప్తూ.. విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. ఫర్నిచర్, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ వంటి వాటికి 40 శాతం డిస్కౌంట్ ఆఫర్ అంటూ నమ్మబలికాడు. దీంతో యజమాని మాటలకు మోసం పోయిన అనేకమంది ముందస్తుగా డబ్బులు చెల్లించి అర్డర్ చేసుకున్నారు.
కాగా, కొన్ని రోజులకు ట్రేడర్స్ వారు స్టాక్ డెలివరీ చేస్తామన్న తేదీ దగ్గర పడింది. అయిన ఆర్డర్ ఇంటికి రాకపోవడంతో షాప్ యజమానికి ఫోన్ చేశారు బాధితులు. ఫోన్ స్వీచ్‌ఆఫ్ రావడంతో బాధితులు షాపు దగ్గరకు పరుగులు తీశారు. తీర షాపు దగ్గరకు వెళ్లీ చూడగా.. షాపు క్లోజ్ ఉండటం చూసి తలలు పట్టుకున్నారు. వారం రోజులు గడిచిన షాపు తీయకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు జిల్లా పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read :
రైళ్లలో లగేజీకి కూడా రూల్స్ ఉన్నాయి.. అప్రమత్తంగా ఉండండి
CAT 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పరీక్ష షెడ్యూల్ తెలుసుకోండి