NHRC: సంధ్య థియేటర్ ఘటనపై సీఎస్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:20 AM
పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద గత డిసెంబరు 3న జరిగిన తొక్కిసలాటపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీపీకి ఆదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద గత డిసెంబరు 3న జరిగిన తొక్కిసలాటపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుటుంబానికి రూ.5లక్షల నష్టపరిహారం ఎందుకు చెల్లించకూడదు ? అని ప్రశ్నించింది. ఇక, శాంతి భద్రతల నిర్వహణలో పోలీసు శాఖ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ అభిప్రాయపడింది. మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి ఆరు వారాల్లోపు నివేదిక సమర్పించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ (శాంతి భద్రతలు)ను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. కాగా, సంధ్య థియేటర్ వద్ద లాఠీచార్జి, తొక్కిసలాటలో రేవతి మరణం, ఆమె ఇద్దరు పిల్లలు గాయపడడంపై ఇమ్మనేని రమణారావు అనే న్యాయవాది చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ నోటీసులు జారీ చేసింది. ఇదే ఘటనపై హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్ ఇప్పటికే రెండుసార్లు వివరణలు ఇచ్చినప్పటికీ ఎన్‌హెచ్‌ఆర్‌సీ సంతృప్తి చెందలేదు.
వానాకాలం సాగు విస్తీర్ణంలో 69 శాతం నమోదు!
రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): వానాకాలం పంటల సాగు విస్తీర్ణంలో ఇప్పటివరకు 69 శాతం విస్తీర్ణంలో సాగు నమోదైందని రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదిలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 1 కోటి 32 లక్షల 44 వేల 305 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను.. బుధవారం నాటికి 91,52,976 ఎకరాల్లో సాగు పూర్తయిందని తెలిపింది. గతేడాది ఇదే సమయానికి 80.71లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు కాగా... ఈ ఏడాది అంతకంటే 10 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు సాగైనట్లు వివరించింది. వరి 30,15,599 ఎకరాలు, పత్తి 43,70,919, మొక్కజొన్న 5,52,551 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. వీటితో పాటు 4,43,335 ఎకరాల్లో కంది, 3,55,857 ఎకరాల్లో సోయాబీన్, మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగు చేసినట్లు నివేదికలో వ్యవసాయశాఖ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు