New Ration Card: క్యూఆర్ కోడ్‌తో రేషన్‌కార్డు
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:10 AM
దానిపై ఎప్పట్లాగే కుటుంబ సభ్యుల వివరాలు ఫొటోలతో సహా ఉంటాయి! ఇప్పుడు అదనంగా ఓ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది! దానిని స్కాన్ చేశారనుకోండి..! కుటుంబ సభ్యుల వివరాలు ఫొటోలతో సహా వచ్చేస్తాయి!

లేత నీలం రంగులో.. పోస్టుకార్డు సైజులో
కొత్తవారికి, పాతవారికి కూడా..త్వరలోనే కోటి మందికి జారీ!
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్ కార్డు.. లేత నీలం రంగులో పోస్టు కార్డు కంటే కాస్త తక్కువ సైజులో ఉంటుంది! దానిపై ఎప్పట్లాగే కుటుంబ సభ్యుల వివరాలు ఫొటోలతో సహా ఉంటాయి! ఇప్పుడు అదనంగా ఓ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది! దానిని స్కాన్ చేశారనుకోండి..! కుటుంబ సభ్యుల వివరాలు ఫొటోలతో సహా వచ్చేస్తాయి! ఈ మేరకు కార్డుల జారీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు సమాచారం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికే కాదు.. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుదారులకూ ఈ కొత్త కార్డులను జారీ చేయనున్నారు. ఈ దిశగా పౌర సరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,95,282 రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డులు, కొత్తగా సభ్యులను చేర్చడానికి మరో 18 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే వీటి పరిశీలన పూర్తయింది. పాతవి, కొత్తవి కలిపి మొత్తం కోటి రేషన్ కార్డులను ప్రభుత్వం కొత్తగా అందించనుంది.
ఒక్కో కార్డు ధర రూ.3
బోగస్, నకిలీ కార్డులను అడ్డుకోవడమే ధ్యేయంగా క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రేషన్ షాపు దగ్గరకు వెళ్లినప్పుడు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినా లేదా కుటుంబంలోని ఏ వ్యక్తి వేలిముద్ర వేసినా రేషన్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా, ఆ కార్డులోని వ్యక్తులే రేషన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుందని, ఇతరులు తీసుకునేందుకు ఆస్కారం ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునేందుకు ‘పోర్టబిలిటీ’కీ దీని ద్వారా అవకాశం ఉంది. ఒక్కో క్యూఆర్ కోడ్ కార్డుకు రూ.3 ఖర్చవుతుందని తెలిసింది. నిజానికి, ‘చిప్ కార్డు’ను జారీ చేయాలని తొలుత భావించారు. దీని ధర ఒక్కో కార్డుకు రూ.31 వరకు ఉండడంతోపాటు ఎప్పుడైనా మార్పుచేర్పులు చేయడానికి, సాంకేతికంగా పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు సూచించడంతో చిప్ కార్డు ఆలోచనను విరమించుకున్నట్టు సమాచారం. క్యూఆర్ కోడ్ కార్డు అయితే మార్పుచేర్పులకూ పెద్దగా ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. కాగా, కొత్త కార్డులపై సీఎం రేవంత్‌తోపాటు సంబంధిత మంత్రి ఉత్తమ్ ఫొటోలు ఉంచాలా, లేదంటే ఎవరి ఫొటోలు లేకుండానే జారీ చేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వ లోగో మాత్రం కార్డుపై ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈసారి అందించేబోయే కొత్త కార్డులను ఇంటి మహిళ పేరు మీద అందించనున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి
PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్
Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ
Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు
Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..
Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.