శంషాబాద్ నుంచి మదీనాకు ఇండిగో విమానం
ABN , Publish Date - Feb 22 , 2025 | 04:38 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మదీనాకు కొత్త ఇండిగో విమాన సేవలను శుక్రవారం ప్రారంభించారు.
ప్రారంభించిన సీఈవో ప్రదీప్ ఫణికర్
శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మదీనాకు కొత్త ఇండిగో విమాన సేవలను శుక్రవారం ప్రారంభించారు. తొలి విమానం జీహెచ్‌ఐఎల్ సీనియర్ అధికారుల సమక్షంలో బయలుదేరింది. సోమ, గురు, శనివారం ఈ సర్వీసు సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రయాణ సమయం 5 గంటల 47 నిమిషాలు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ.. మదీనాకు ఇండిగో తొలి విమాన సర్వీసును నడిపించడం సంతోషంగా ఉందన్నారు.