New Piracy Website: ఐబొమ్మ అంతం కాలేదు!
ABN , Publish Date - Nov 21 , 2025 | 09:53 AM
ఆన్‌లైన్‌లో మరో పైరసీ భూతం ప్రత్యక్షమైంది. ఎస్‌బీఐ ఇన్సూరెన్స్ పోర్టల్‌లో పైరసీ సినిమాలు కనపడుతుండటం కలకలం రేపుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: సినిమా పైరసీకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఓ వైపు పోలీసులు శ్రమిస్తుంటే.. ఆన్‌లైన్‌లో పైరసీ భూతాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఎస్‌బీఐ ఇన్సూరెన్స్ పోర్టల్‌లో..
ఐబొమ్మ(iBomma) నిర్వాహకుడిని అరెస్టు చేసిన తర్వాత ఐబొమ్మ వన్, ఐబొమ్మ ప్లస్ అంటూ కొత్త పైరసీ వెబ్‌సైట్ల పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో పైరసీ వెబ్‌సైట్ పుట్టుకొచ్చింది. ఎస్‌బీఐ ఇనూరెన్స్ పోర్టల్‌లో పైరసీ సినిమాలు ప్రత్యక్షమవ్వడం కలకలం రేపుతోంది. sbiterminsurance.com పేరుతో ఓ కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. Term insurance laps and revival guide అనే పైరసీ సినిమాలు రీడైరెక్ట్ అవుతున్నాయి. ఆ సైట్‌లో ఓపెన్ చేస్తే ఈ పేజీ లో పైరస్ సినిమాలు ఓపెన్ అవుతున్నాయి. కాగా పైరసీ వెబ్ సైట్లన్నీ ఐబొమ్మ పేరును వాడుకుంటుండటం గమనార్హం. సైబర్ నేరగాళ్లు ఇప్పటికే ఉన్న వెబ్‌సైట్లకు ఐబొమ్మగా పేరు మార్చి.. వాటిపై క్లిక్ చేస్తే తమ పేజీకి రీడైరెక్ట్ అయ్యేలా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
మినీ వేలాన్ని ఆపేయండి: రాబిన్ ఉతప్ప
పెళ్లి పీటలెక్కనున్న స్మృతి మంధాన
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి