Shirdi: షిర్డీలో శ్రీ సాయినాథ్ ఆస్పత్రి
ABN , Publish Date - Mar 14 , 2025 | 06:01 AM
షిర్డీ సాయిబాబా సంస్థాన్ సహకారంతో షిర్డీ పరిసర ప్రాంతాల్లో కంటి సమస్యలు ఉన్న వారికి పరిష్కారం అందించేందుకు సాయిబాబా కృపతో శ్రీ సాయినాథ్ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నామని అపోలో ఆస్పత్రి జాయింట్ డైరెక్టర్ సంగీతా రెడ్డి తెలిపారు.

ప్రారంభించిన అపోలో ఆస్పత్రి జాయింట్ డైరెక్టర్ సంగీతా రెడ్డి
హైదరాబాద్ సిటీ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): షిర్డీ సాయిబాబా సంస్థాన్ సహకారంతో షిర్డీ పరిసర ప్రాంతాల్లో కంటి సమస్యలు ఉన్న వారికి పరిష్కారం అందించేందుకు సాయిబాబా కృపతో శ్రీ సాయినాథ్ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నామని అపోలో ఆస్పత్రి జాయింట్ డైరెక్టర్ సంగీతా రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని షిర్డీలో సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన 200 పడకల ఆస్పత్రిని సంగీతా రెడ్డి, సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి గోరకేష్ గోందికర్ సాహెబ్‌తో కలిసి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి సంగీతా రెడ్డి ఆర్థిక సహకారమందించారు.
ఈ ఆస్పత్రికి అవసరమైన అనుమతులను మహారాష్ట్ర ప్రభుత్వం అందించిందని, ఆస్పత్రిలో మొదటి రోజు నుంచి కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించవచ్చని సంగీతా రెడ్డి తెలిపారు. దాతల నుంచి సేకరించిన కార్నియా కంటి చూపులేని వారికి వరంగా మారుతుందన్నారు. నేటి నుంచి షిర్డీ.. సాయి నాథుడి భక్తి భావంతో పాటు కంటి చికిత్సలకు కూడా మారుపేరుగా నిలుస్తుందని సంగీతా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా సంస్థాన్ అధికారులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.