ఏటా 13 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:45 AM
దేశంలో ఏటా దాదాపు 13 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని యశోద గ్రూప్ ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు తెలిపారు. వీటిలో బ్లడ్ క్యాన్సర్ కేసులు గణనీయ నిష్పత్తిలో ఉంటున్నాయని గ్లోబోకాన్-2020 నివేదిక చెబుతోందన్నారు.

యశోద ఆస్పత్రుల ఎండీ డాక్టర్ జీఎ్‌సరావు
దేశంలో ఏటా దాదాపు 13 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని యశోద గ్రూప్ ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు తెలిపారు. వీటిలో బ్లడ్ క్యాన్సర్ కేసులు గణనీయ నిష్పత్తిలో ఉంటున్నాయని గ్లోబోకాన్-2020 నివేదిక చెబుతోందన్నారు. జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ గణాంకాల ప్రకారం లుకేమియా, లింఫోమా వంటి బ్లడ్ క్యాన్సర్ కేసులు హైదరాబాద్ వంటి నగరాలు, పట్టణాల్లో ఎక్కువగాఉంటున్నాయన్నారు. శనివారం హైటెక్ సిటీ యశోద ఆస్పత్రిలో బ్లడ్ క్యాన్సర్లపై అంతర్జాతీయ సదస్సు ‘డెక్కన్ హెమటోలింక్ 2.ఓ’ను జీఎస్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ సవాళ్లు విసురుతున్నా ఎముక మజ్జ మార్పిడి, కార్-టీ సెల్ చికిత్స వంటి విధానాలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయన్నారు. బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడాలంటే రోగులకు చికిత్సతో పాటు మానసిక బలం, ఆర్థిక మద్దతు అవసరమన్నారు. యశోద ఆస్పత్రిలో గత 12 సంవత్సరాలుగా 500కు పైగా ఎముక మజ్జ మార్పిడి చికిత్సలను విజయవంతంగా నిర్వహించామని, వేలాది మంది బ్లడ్ క్యాన్సర్ రోగులకు చికిత్స అందించామని సీనియర్ హెమటాలజిస్టు డాక్టర్ గణేష్ జైషేత్వర్ తెలిపారు. సదస్సులో 200 మంది జాతీయ, 10 మంది అంతర్జాతీయ బ్లడ్ క్యాన్సర్ వైద్య నిపుణులు పాల్గొన్నారు.