Nauheera Shake: చీటింగ్ కేసులో నౌహీరా షేక్ మరోసారి అరెస్ట్
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:20 AM
హీరా గ్రూప్ సంస్థల అధినేత్రి నౌహీరా షేక్ మరోసారి అరెస్ట్ అయ్యారు. వరంగల్ పోలీసు కమిషనరేట్...
హైదరాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : హీరా గ్రూప్ సంస్థల అధినేత్రి నౌహీరా షేక్ మరోసారి అరెస్ట్ అయ్యారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఇంతెజార్‌గంజ్ పోలీసులు నౌహీరా షేక్‌ను అరెస్ట్ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసేందుకు వెళ్లిన సమయంలో ఇంతెజార్‌గంజ్ పోలీసులు ఆమెను ఆదివారం అరెస్ట్ చేశారు. బంగారంలో పెట్టుబడుల పేరుతో వరంగల్‌కు చెందిన ఫర్వేజ్, ఎజాజ్, ఎజాజ్ భార్య నుంచి రూ. 33 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2021లో ఇంతెజార్‌గంజ్ పోలీసులు నౌహీరాపై కేసు నమోదు చేశారు. వరంగల్ ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్(ఎన్‌బీడబ్ల్యూ)పై ఇంతెజార్‌గంజ్ పోలీసులు నౌహీరాను అరెస్ట్ చేసి నర్సంపేట సబ్‌జైలుకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News