Narendra Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం మాదే
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:21 AM
కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రె్‌సదేనని ఆ పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఓటమి బాధ్యతను పెంచింది: నరేందర్‌రెడ్డి
కరీంనగర్ అర్బన్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రె్‌సదేనని ఆ పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టభద్రులంతా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని అన్నారు. ఓటమి తన బాధ్యతను మరింత పెంచిందని, కాంగ్రెస్ వాదిగా పార్టీలో మరింత చురుకుగా పని చేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. కరీంనగర్ కాంగ్రె్‌సలో నాయకత్వలోపం స్పష్టంగా కనబడుతోందని, పార్టీ ప్రక్షాళనకు కృషి చేస్తానని తెలిపారు. 28,686 చెల్లుబాటు కాని ఓట్లే తన ఓటమికి కారణమని. అందులో పది వేల ఓట్లు తనకు వచ్చేవేనని చెప్పారు. చెల్లని ఓట్లపై పరిశీలన చేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశానని తెలిపారు.