Share News

Narayana results: సత్తా చాటిన నారాయణ విద్యార్థులు

ABN , Publish Date - Jun 03 , 2025 | 06:01 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఓపెన్‌ కేటగిరీలో మాజిద్‌ హుస్సేన్‌ 3వ ర్యాంక్‌, పార్థ్‌ వార్ధక్‌ 4వ, అక్షత్‌ చౌరాసియా 6వ, సాహిల్‌ డియో 7వ, వడ్లమూడి లోకేష్‌ 10వ ర్యాంక్‌తో టాప్‌ 10లో నిలిచారు.

Narayana results: సత్తా చాటిన నారాయణ విద్యార్థులు

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారని ఆ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్‌ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో మాజిద్‌ హుస్సేన్‌ (3వ ర్యాంక్‌), పార్థ్‌ మందర్‌ వార్ధక్‌ 4, అక్షత్‌ చౌరాసియా 6, సాహిల్‌ డియో 7, వడ్లమూడి లోకేష్‌ 10వ ర్యాంక్‌లతో టాప్‌ 10లో నిలిచారని పేర్కొన్నారు. వీరితోపాటు ఓపెన్‌ కేటగిరీలో 100లోపు 43 ర్యాంకులు తమ విద్యార్థులు కైవసం చేసుకున్నారని వెల్లడించారు. అన్ని కేటగిరీల్లో 50లోపు 42 ర్యాంకులు, 100లోపు 75 ర్యాంకులను సొంతం చేసుకుని, విశేష ప్రతిభ చాటారని వివరించారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వారు అభినందించారు.


ఇవీ చదవండి:

కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్

పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 06:01 AM