Komatireddy On CM Revanth: మేం సీనియర్లం.. రేవంత్ రెడ్డి జూనియర్.. అయినా..
ABN , Publish Date - Aug 04 , 2025 | 01:42 PM
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏబీఎన్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. అంతేకాకుండా బనకచర్ల ప్రాజెక్ట్‌పై సైతం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నల్గొండ: తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఏబీఎన్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్కాంలో ఉన్న ఎవరైనా సరే జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ల వద్దే కోట్లు దొరుకుతున్నాయంటే... ఆ సమయంలో అధికారంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు వద్ద ఎన్ని కోట్లు ఉండొచ్చో ఊహించుకోవచన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని, కేబినెట్ సమావేశం తర్వాత అధికారికంగా వివరాలు వెల్లడిస్తారని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.20వేల కోట్లతో 119 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి ప్రణాళిక వేశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నల్గొండ నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ స్కూళ్లను 9 నెలల్లో పూర్తి చేసే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని, 6 వేల పాఠశాలలు మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను ప్రాధాన్యతగా తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. తాను, ఉత్తమ్ సీనియర్లుగా ఉన్నా జూనియర్ అయిన రేవంత్ రెడ్డి అందరినీ గౌరవిస్తున్నారని, పార్టీ ఒక టీమ్ వర్క్‌లా పనిచేస్తోందని అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తన రాజీనామా వృథా కాలేదని పేర్కొన్న మంత్రి, అప్పుడు మనం చేసిన త్యాగాలు ఇప్పుడు ఫలిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత వ్యవహారం గురించి మీడియా ప్రశ్నించగా.. కవిత ఎవరో తనకు తెలియదని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే బనకచర్ల ప్రాజెక్ట్‌ను కట్టనివ్వమని, శ్రీశైలం ప్రాజెక్టును కాపాడతామని వివరించారు. నల్గొండ జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తామని హామీ ఇచ్చారు. రైతుల అభివృద్ధికి అవసరమైన నీటి ప్రాజెక్టులపై తాము కట్టుబడి ఉన్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read:
లైఫ్ సైన్సెస్ కేపిటల్‌గా హైదరాబాద్‌కు గుర్తింపు: రేవంత్‌రెడ్డి
ఆధార్ అడ్రస్ అప్‌డేట్..ఇలా ఇంటి నుంచే చేసుకోండి
For More Telangana News