Share News

MP Chamala Criticizes KTR: ఆనాడు చేర్చుకున్న 60 మందితో ఎందుకు రాజీనామా చేయించలేదు

ABN , Publish Date - Aug 26 , 2025 | 03:15 AM

పదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు...

MP Chamala Criticizes KTR: ఆనాడు చేర్చుకున్న 60 మందితో ఎందుకు రాజీనామా చేయించలేదు

  • కేటీఆర్‌ను నిలదీసిన ఎంపీ చామల

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ పాలనలో 60 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీలో చేర్చుకున్నప్పుడు.. వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో దమ్ము ఎందుకు నిరూపించుకోలేదని కేటీఆర్‌ను నిలదీశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ సీఎం అయ్యాకే హైదరాబాద్‌ అభివృద్ధి చెందినట్లుగా కేటీఆర్‌ మాట్లాడుతున్నాడని, వాస్తవానికి పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కట్టింది 4 ఫ్లైఓవర్లు, దుర్గంచెరువు వద్ద సెల్ఫీ పాయింట్‌ మాత్రమేనన్నారు. కేటీఆర్‌ కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకోవడానికే హైదరాబాద్‌ను వాడుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పట్టుమని పది జెడ్పీటీసీలు లేని బీజేపీకి స్థానిక ఎన్నికల్లో సగానికిపైగా సీట్లు వస్తాయంటూ రాంచందర్‌రావు బీరాలు పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు.

జూబ్లీహిల్స్‌లో జనహిత సభ 30కి వాయిదా..

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మంగళవారం జరగాల్సిన జనహిత పాదయాత్ర, సభ.. ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది. రాహుల్‌గాంధీ బిహార్‌లో చేపట్టిన ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, మహేశ్‌గౌడ్‌ తదితరులందరూ వెళ్తున్న నేపథ్యంలో సభను వాయిదా వేశారు.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ

ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 03:15 AM