Share News

NEET Exam: నీట్‌ పరీక్ష రాసిన తల్లీకూతుళ్లు

ABN , Publish Date - May 05 , 2025 | 03:55 AM

పెళ్లయి ముగ్గురు పిల్లలు పుట్టాక.. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన పెద్ద కూతురితో కలిసి నీట్‌ పరీక్ష రాసింది. అందుకు ఆమె భర్త సహకారం సంపూర్ణంగా ఉండడం విశేషం.

NEET Exam: నీట్‌ పరీక్ష రాసిన తల్లీకూతుళ్లు

ఖమ్మం ఖానాపురంహవేలి, మే 4 (ఆంధ్రజ్యోతి): ‘వివాహం విద్య నాశాయ’ ..అని సామెత! కానీ, ఆ తల్లి అలా అనుకోలేదు. పెళ్లయి ముగ్గురు పిల్లలు పుట్టాక.. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన పెద్ద కూతురితో కలిసి నీట్‌ పరీక్ష రాసింది. అందుకు ఆమె భర్త సహకారం సంపూర్ణంగా ఉండడం విశేషం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మంచానాయక్‌ తండాకు చెందిన ఆ తల్లీకుమార్తెల పేర్లు.. బానోత్‌ సరిత, బానోత్‌ కావేరి. సరిత బీఎస్సీ నర్సింగ్‌ రెండో సంవత్సరం చదువుతుండగా.. తల్లిదండ్రులు ఆమె చదువు ఆపించి, అదే గ్రామానికి చెందిన భూక్యా కిషన్‌తో పెళ్లి చేశారు.


ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె కావేరి ఇంటర్‌పూర్తి చేసి నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని పరీక్ష రాసింది. సరిత కూడా ఆమెతో కలిసి నీట్‌ పరీక్ష రాసింది. తల్లి కూడా తనతో పాటే నీట్‌ పరీక్ష రాయటం సంతోషంగా ఉందని.. ఇద్దరం కలిసి ఖమ్మంలో ఒకే గదిలో ఉండి కోచింగ్‌ తీసుకున్నామని, తల్లి సూర్యాపేటలో పరీక్ష రాయగా తాను ఖమ్మంలో రాసినట్టు కావేరి తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..

Updated Date - May 05 , 2025 | 03:55 AM