KLH University: కేఎల్‌హెచ్‌లో విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్
ABN , Publish Date - May 04 , 2025 | 04:35 AM
మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే అత్యుత్తమ ఉద్యోగాలతో పాటు ఎటువంటి ఆందోళన లేకుండా కేరీర్‌ను పూర్తి చేసుకోవచ్చునని జేపీ మోర్గన్ కంపెనీ ఉపాధ్యక్షుడు మారియో డేవిడ్ పేర్కొన్నారు.
75 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు
ఘనంగా ప్లేస్‌మెంట్ సక్సెస్ మీట్
మొయునాబాద్ రూరల్, మే 3 (ఆంధ్రజ్యోతి): మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే అత్యుత్తమ ఉద్యోగాలతో పాటు ఎటువంటి ఆందోళన లేకుండా కేరీర్‌ను పూర్తి చేసుకోవచ్చునని జేపీ మోర్గన్ కంపెనీ ఉపాధ్యక్షుడు మారియో డేవిడ్ పేర్కొన్నారు. కేఎల్‌హెచ్ యూనివర్సిటీలో శనివారం రాత్రి ప్లేస్‌మెంట్స్ సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేట్ కంపెనీలకు చెందిన ప్రతినిధుల చేతుల మీదుగా విద్యార్థులు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మారియో డేవిడ్ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధ్దిలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని, వాటిపై నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది జర్మనీ, జపాన్, సింగపూర్, దుబాయ్ వంటి దేశాల్లో విద్యార్థులు అంతర్జాతీయ ప్లేస్‌మెంట్స్ దక్కించుకున్నారని తెలిపారు.
మూడో ఏడాదిలోనే జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది 500లకు పైగా కంపెనీలు క్యాంప్‌సకు వచ్చి విద్యార్థులను ఇంటర్వ్యూలు చేశాయని పేర్కొన్నారు. సృజనాత్మక నైపుణ్యం ఉన్న యువతకు కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రణాళిక ప్రకారం చదువును కొనసాగించే విద్యార్థులకు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారధివర్మ మాట్లాడుతూ.. ఈ ఏడాది రూ.75 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో తమ విద్యార్థులు ప్లేస్‌మెంట్ సాధించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. రూ.20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వార్షిక ప్యాకేజీతో సూపర్ డ్రీమ్, డ్రీమ్ కంపెనీల్లో తమ విద్యార్థులు ప్లేస్‌మెంట్ సాధించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల రామకృష్ణ, అధ్యాపక బృందంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..