BRS MLC Kavitha: 16న అమెరికాకు ఎమ్మెల్సీ కవిత
ABN , Publish Date - May 05 , 2025 | 04:30 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈనెల 16న అమెరికా వెళ్లనున్నారు. కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్‌కు హాజరయ్యేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది
అనుమతినిచ్చినసీబీఐ కోర్టు
హైదరాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈనెల 16న అమెరికాకు వెళ్లనున్నారు. కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు భర్త అనిల్‌తో కలిసి కవిత అమెరికా వెళ్తున్నట్లు ఎమ్మెల్సీ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 16 నుంచి 22 వరకు కవిత అక్కడే ఉంటారని.. 23న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈమేరకు ఆమె పర్యటనకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది.