వంశీ బ్యారక్‌కు పరదా!
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:47 AM
గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు ముదునూరి సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించి, కేసు నుంచి తప్పుకొనేలా చేశారన్న ఆరోపణలపై వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించగా, జైలు అధికారులు ఆయనకు ఒకటో నంబరు బ్యారక్‌లో ఒక గదిని కేటాయించారు.

విజయవాడ జిల్లా జైలులో భద్రతా చర్యలు
నేడు 164 వాంగ్మూలం నమోదుకు న్యాయాధికారి ముందుకు సత్యవర్ధన్
విజయవాడ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బ్యారక్‌కు అధికారులు పరదాలు కట్టినట్టు తెలిసింది. భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు ముదునూరి సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించి, కేసు నుంచి తప్పుకొనేలా చేశారన్న ఆరోపణలపై వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించగా, జైలు అధికారులు ఆయనకు ఒకటో నంబరు బ్యారక్‌లో ఒక గదిని కేటాయించారు. అందులో ఉన్న వంశీ ఇతర ఖైదీలకు కనిపించకుండా కటకటాల వద్ద పరదా కట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇతర ఖైదీలెవరూ వంశీ ఉన్న బ్యారక్ వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. బ్యారక్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
కోర్టుకు సత్యవర్ధన్
ముదునూరి సత్యవర్ధన్‌ను న్యాయాధికారి ముందు సోమవారం ప్రవేశపెట్టడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. వల్లభనేని వంశీ ఇచ్చిన ప్రణాళికలతో ఆయన అనుచరులు తనను బెదిరించి కిడ్నాప్ చేశారని, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనకు సంబంధం లేదని చెప్పించారని సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలాన్ని సీఆర్పీసీ 164 కింద న్యాయాధికారి ముందు చెప్పాల్సి ఉంటుంది. పోలీసులు వంశీని విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. బాధితుడు సత్యవర్ధన్ వాంగ్మూలాన్ని ఈ కోర్టులో కాకుండా మరో కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పోలీసులు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు లేఖ రాశారు. సత్యవర్ధన్ నుంచి 164 వాంగ్మూలాన్ని నమోదు చేసుకునేందుకు కోర్టును కేటాయించాలని అందులో పేర్కొన్నారు. దీనిపై సీఎంఎం కోర్టు సోమవారం నిర్ణయం తీసుకుని కోర్టును కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News