Share News

Mandula Sameelu: తుంగతుర్తికి నేనే లీడర్‌.. వేరెవ్వరూ కాదు

ABN , Publish Date - Feb 10 , 2025 | 03:52 AM

‘‘తుంగతుర్తి నియోజకవర్గానికి నేనే లీడ ర్‌. వేరెవ్వరూ కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్‌లు ఇచ్చేది నేనే. నేను సంతకం చేస్తేనే ఇందిరమ్మ ఇళ్లు వస్తాయి.

Mandula Sameelu: తుంగతుర్తికి నేనే లీడర్‌.. వేరెవ్వరూ కాదు

  • స్థానిక ఎన్నికలకు బీఫామ్‌లు ఇచ్చేది నేనే: ఎమ్మెల్యే సామేలు

మోత్కూరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ‘‘తుంగతుర్తి నియోజకవర్గానికి నేనే లీడ ర్‌. వేరెవ్వరూ కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్‌లు ఇచ్చేది నేనే. నేను సంతకం చేస్తేనే ఇందిరమ్మ ఇళ్లు వస్తాయి. ఎవరో బీఫామ్‌లు ఇస్తామంటే, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామంటే నమ్మవద్దు’’ అని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. కాంగ్రెస్‌ అసమ్మతి నాయకులు ఇటీవల మోత్కూరులో నిర్వహించిన సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. తనతో వచ్చేవారే తనవారని స్పష్టం చేశారు.


ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఆర్యవైశ్య భవన్‌లో సామేలు విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పేలవ ప్రదర్శన నేపథ్యంలో ‘‘సీఎం రేవంత్‌రెడ్డిది ఐరన్‌ లెగ్‌’’ అని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సామేలు ఖండించారు. ‘‘కేటీఆర్‌ సోదరి కవిత కారణంగానే ఆప్‌ ఓడిపోయింది కదా.. ఎవరిది ఐరన్‌ లెగ్‌’’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు.

Updated Date - Feb 10 , 2025 | 03:52 AM