Share News

Uttam Kumar Reddy: రేపు సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం

ABN , Publish Date - Apr 05 , 2025 | 04:19 AM

శ్రీరామనవమి పండుగ (ఆదివారం) రోజున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిఽధులు సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు.

Uttam Kumar Reddy: రేపు సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం

  • ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలి

  • భద్రాచలంలో లబ్ధిదారుడి ఇంటికి వెళ్లనున్న సీఎం: మంత్రి ఉత్తమ్‌ వెల్లడి

  • శుక్రవారం సూర్యాపేటలో ఓ లబ్ధిదారు ఇంట్లో భోజనం చేసిన మంత్రి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి పండుగ (ఆదివారం) రోజున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిఽధులు సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. అదేరోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి... భద్రాచలంలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేస్తారని తెలిపారు. సచివాలయంలో శుక్రవారం మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. ‘‘సన్నబియ్యం సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరగనివ్వొద్దు. గోదాముల నుంచి బియ్యం రవాణా, రేషన్‌ షాపుల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేయాలి.


ప్రజల నుంచి ఏమైనా ఫిర్యాదులుంటే పరిష్కరించాలి. ప్రతి లబ్ధిదారుడికి సన్నబియ్యం చేరేలా చర్యలు తీసుకోవాలి. డీలర్లుగానీ, అధికారులు గానీ ఏమైనా అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు. గతంలో సంవత్సరానికి రూ.10,665 కోట్లు ఖర్చుపెట్టి దొడ్డు బియ్యం పంపిణీ చేసినా ప్రభుత్వం ఆశించిన మేరకు ప్రయోజనం కలగలేదని, రేషన్‌ బియ్యం పక్కదారి పట్టిందని ఆరోపించారు. ఇప్పుడు రూ.13వేల కోట్లు వెచ్చించి 30 లక్షల టన్నుల సన్న బియ్యాన్ని పేదలకు అందిస్తున్నామన్నారు. కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ, సభ్యుల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులైన పేదలందరినీ లబ్ధిదారులుగా నమోదు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ‘సన్న బియ్యం’తో లబ్ధి పొందే కుటుంబాల సంఖ్య కోటి దాటుతుందని పేర్కొన్నారు. కాగా, మంత్రి ఉత్తమ్‌ శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో సన్నబియ్యం లబ్ధిదారు పాలడుగు శ్రీనివాస్‌ ఇంట్లో భోజనం చేశారు. ఇక నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం సన్న బియ్యం లబ్ధిదారులైన వల్లాల లక్ష్మమ్మ, సైదులు దంపతుల ఇంట్లో భోజనం చేశారు.


ఇవి కూడా చదవండి:

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..


Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 05 , 2025 | 04:19 AM