Minister Uttam Kumar Reddy: అసెంబ్లీలో నేనే సీనియర్.. కేసీఆర్ అక్కడ ఓడిపోయారు..
ABN , Publish Date - Nov 25 , 2025 | 05:48 PM
మీడియా చిట్‌చాట్‌లో రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒకేపార్టీ నుంచి వరుసగా ఏడు సార్లు గెలిచానని గుర్తు చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ తర్వాత తానే సీనియర్ అని చెప్పారు. అయితే..
మీడియా చిట్‌చాట్‌లో రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒకేపార్టీ నుంచి వరుసగా ఏడు సార్లు గెలిచానని గుర్తు చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ తర్వాత తానే సీనియర్ అని చెప్పారు. అయితే కేసీఆర్ వివిధ పార్టీల నుంచి గెలిచారని.. అలాగే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయారని గుర్తు చేశారు. తాను మాత్రం ఎప్పుడూ ఓడిపోలేదని చెప్పారు. కొదాడలో జరిగింది లాక్ అప్ డెత్ కాదని.. ఆయనపై CMRF చెక్స్ ఫ్రాడ్ కేసు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన DCC అధ్యక్ష పదవులు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సూర్యపేట DCC పదవి తమకు ఇస్తామన్నారని, అయితే తామే ఆ పదవిని వద్దనుకున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
కోటి ఉద్యోగాలు, కొత్తగా టెక్ హక్.. నితీశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
కొనసాగిన నష్టాలు.. వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే సెన్సెక్స్..