Share News

Ponguleti: నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం

ABN , Publish Date - May 30 , 2025 | 04:25 AM

నకిలీ విత్తనాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

Ponguleti: నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం

ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణకు మొదటి స్థానం.. సాదాబైనామాలపై త్వరలోనే నిర్ణయం!

  • 2 నుంచి కొత్త గ్రామపాలన అధికారుల నియామకాలు

  • మంత్రి పొంగులేటి

  • ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో.. కలెక్టర్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం

వరంగల్‌, మే 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నకిలీ విత్తనాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. గురువారం ఆయన హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి కొండా సురేఖతో కలిసి ఉమ్మడి వరంగల్‌ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో ధాన్యం సేకరణ, వ్యవసాయం, వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులను విక్రయించేవారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలన్నారు. అంచనాలకు మించి 160ు ధాన్యం దిగుబడి వచ్చిందని.. యాసంగి, వానాకాలం పంటలను కలిపి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 85ు ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. సాదాబైనామా విషయం కోర్టులో ఉందని, కోర్టు సెలవులు పూర్తికాగానే ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గ్రామ పాలన అధికారుల పరీక్షలు పూర్తయ్యాయని, ఉత్తీర్ణులైన వారిని జూన్‌ 2న విధుల్లో నియమిస్తామన్నారు. జూన్‌ 3 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఆగస్టు 15 వరకు స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.


కలెక్టర్లపై మంత్రి ఆగ్రహం

ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కలెక్టర్ల నిర్లక్ష్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జిల్లాల్లో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారు. వారిని సమన్వయం చేసుకుని, ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాను ఫైనల్‌ చేయలేరా?’’ అంటూ నిలదీశారు. ‘‘నేను సంతకం చేసి, పంపించిన ప్రొసీడింగ్స్‌ ఇంట్లో ఫ్రేమ్‌కట్టుకుని పెట్టుకోవడానికా??’’ అంటూ మంత్రి మండిపడ్డారు. జూన్‌ 6లోపు ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ను అందజేయాలన్నారు. ఇళ్ల పథకానికి వయస్సు పరిమితి లేదని చేశారు. అత్యంత పేదలకు మొదటి ప్రాధాన్యతనివ్వాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ రాంచంద్రనాయక్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్

గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 30 , 2025 | 04:25 AM