Ponguleti Srinivasa Reddy: పేదోడి కళ్లల్లో ఆనందం చూడాలి:పొంగులేటి
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:01 AM
పేదోడి కళ్లల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆయన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
హనుమకొండ టౌన్, ఆగస్టు8(ఆంధ్రజ్యోతి): పేదోడి కళ్లల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆయన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వమని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పేదల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం గత ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఖర్చు చేసి పేదల కల, ఆశలను నెరవేర్చలేదని విమర్శించారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే లక్ష్యంతో పభ్రుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 లక్షల పాత కార్డులు ఉండగా, ఆరు లక్షల కొత్తగా రేషన్ కార్డులు అందించామన్నారు. శ్రావణ శుక్రవారం రోజు 592 మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News