Meenakshi Natarajan: స్థానిక ఎన్నికల్లో పంచాయతీ సంఘటన్ కీలకం
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:11 AM
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ సంఘటన్ కీలక పాత్ర పోషించాల్సి ఉందని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు.
పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఆ ప్రతినిధులు తీసుకోవాలి: మీనాక్షి
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ సంఘటన్ కీలక పాత్ర పోషించాల్సి ఉందని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై క్షేత్రస్థాయిలో విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడానికి సంఘటన్ ప్రతినిధులు తోడ్పడాలని సూచించారు. కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఆదివారం గాంధీభవన్‌లో రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ రాష్ట్ర చైర్మన్ రాచమల్ల సిద్దేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో మీనాక్షి ముఖ్య అతిఽథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పేద, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని చెప్పారు. ఆయా పథకాల లబ్ధిదారులతో మరింత సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు పంచాయతీ సంఘటన్ ప్రతినిధులు బాధ్యతలు స్వీకరించాలన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు, పార్టీ బలపరిచే అభ్యర్థులను గెలిపించే బాధ్యత పంచాయతీ సంఘటన్ తీసుకోవాలని కోరారు. పంచాయతీ సంఘటన్ జాతీయ అధ్యక్షుడు సునీల్ పన్వర్ మాట్లాడుతూ.. సంఘటన్ పనితీరును పరిశీలించి కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్టు ప్రకటించారు. సమావేశంలో ఆ సంఘటన్ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.
తెలంగాణభవన్ ముట్టడికి యత్నం..
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులపై బీఆర్‌ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేత బోయ నాగేశ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బోయ నాగేశ్ మాట్లాడుతూ.. బ్లాక్‌మెయిలర్ కౌశిక్‌రెడ్డితో పాటు కేటీఆర్, హరీశ్‌రావు.. సీఎం రేవంత్, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. మరోసారి బీఆర్‌ఎస్ నేతలెవరైనా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులపై ఇష్టారీతిన మాట్లాడితే తెలంగాణభవన్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం నిరసనకారులను పోలీసులు పీఎ్‌సకు తరలించారు. ఈ క్రమంలోనే.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ నేతలపై కేసు నమోదు చేయాలంటూ బంజారాహిల్స్ పోలీసులకు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం అందజేశారు.
ఇవి కూడా చదవండి..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..