Medak: మెదక్ జిల్లాలో 9 వేల కోళ్ల మృతి
ABN , Publish Date - Mar 01 , 2025 | 04:40 AM
మెదక్ జిల్లాలో 9 వేల కోళ్లు మృతి చెందాయి. కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి గ్రామంలో బర్డ్ ఫ్లూతో 8 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి.
కౌడిపల్లి/నర్సాపూర్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లాలో 9 వేల కోళ్లు మృతి చెందాయి. కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి గ్రామంలో బర్డ్ ఫ్లూతో 8 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన లింబాద్రి అనే రైతు రూ.20 లక్షలతో తన సొంత స్థలంలో పది వేల కోళ్లతో ఫౌలీ్ట్రఫాం నడుపుతున్నారు. శుక్రవారం ఒక్కసారిగా 8 వేల కోళ్లు చనిపోయాయి. దీంతో రైతు బోరున విలపించాడు. తనను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
అయితే, కోళ్లు ఎందుకు చనిపోయాయనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు వెటర్నరీ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా, అందుబాటులోకి రాలేదు. మరోవైపు.. నర్సాపూర్ మండలం అచ్చంపేటలోని ఓ కోళ్లఫాంలో సుమారు వెయ్యి కోళ్లు మృతి చెందాయి. గ్రామానికి చెందిన పాపయ్య కోళ్లఫాం నడుపుతుండగా, నాలుగు రోజులుగా సుమారు వెయ్యి కోళ్లు చనిపోయాయి. శుక్రవారం సాయంత్రం వాటిని ఖననం చేశారు.