MBBS Student Aishwarya: ఎంబీబీఎస్ స్టూడెంట్ ఐశ్వర్య హిట్ అండ్ రన్ కేసు.. కన్నీటి సంద్రంలో కుటుంబం..
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:23 PM
రోడ్డు దాటుతున్న తండ్రీకూతుళ్లను కారు ఢీకొన్న ఘటనలో కూతురు చనిపోగా.. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. మృతురాలిని ఎంబీబీఎస్ చదువుతున్న ఐశ్వర్యగా గుర్తించారు.
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న తండ్రీకూతుళ్లను కారు ఢీకొన్న ఘటనలో కూతురు చనిపోగా.. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. మృతురాలిని ఎంబీబీఎస్ చదువుతున్న ఐశ్వర్యగా గుర్తించారు. ఐశ్వర్య ఆర్టీసీ కాలనీ వద్ద తన తండ్రి పాండుతో కలిసి రోడ్డు దాటుతూ ఉంది. అతి వేగంతో వచ్చిన కారు వారిద్దరినీ ఢీకొట్టింది. ఐశ్వర్య అక్కడికక్కడే చనిపోయింది. పాండు తీవ్రంగా గాయపడ్డంతో ఆస్పత్రికి తరలించారు. ఇక, ఈ సంఘటనపై ఐశ్వర్య కుటుంబ సభ్యులు స్పందించారు. ఎబీఎన్‌తో మాట్లాడుతూ..‘ఉదయం 7 గంటలకు హయత్ నగర్‌లో గుర్తుతెలియని వాహనం ఐశ్వర్యను, ఆమె తండ్రిని ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో మా కోడలు ఐశ్వర్య మృతి చెందింది. ఆమె తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఐశ్వర్య ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతోంది. మార్నింగ్ కాలేజ్‌కి ఐశ్వర్యను డ్రాప్ చేసేందుకు ఆమె తండ్రి వెళ్లాడు. ఇద్దరు కలిసి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు వెనుక నుండి ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. హయత్ నగర్‌లోని ఆర్టీసీ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా అతి వేగంతో వచ్చిన కారు ఐశ్వర్యను ఢీకొట్టడంతో ఐశ్వర్య 10 మీటర్ల అవతల ఎగిరి పడింది. ఐశ్వర్య తలకు తీవ్ర గాయమై మరణించింది. ఈ ప్రమాదంలో తండ్రికి తీవ్రగాయాలు అయ్యాయి.
ఐశ్వర్య మా కుటుంబంలో డైమండ్ లాంటిది. మా ఎంటైర్ ఫ్యామిలీలో ఐశ్వర్య టాలెంటెడ్. మరి కొద్ది రోజుల్లో డాక్టర్‌గా తను సమాజానికి సేవలందించేది. కానీ, ప్రమాదంలో ఇలా మృతి చెందడం మా కుటుంబాన్ని ఎంతగానో బాధిస్తోంది. పోలీసులు కారు నెంబర్ ట్రేస్ చేశారు. కారు నడిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ వేళ ఉద్రిక్తత.. హౌస్ అరెస్టులు
మెడికల్ కాలేజీలపై మంత్రి డోలా కీలక వ్యాఖ్యలు