Manne Krishank : రేవంత్ పరివారాన్ని కోస్తే కోట్లు వస్తాయి
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:23 AM
ఎన్నికలప్పుడు కడుపు కట్టుకొని హామీలు అమలు చేస్తామన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు తనను కోసుకు తిన్నా పైసల్లేవంటున్నారని..
హైదరాబాద్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ఎన్నికలప్పుడు కడుపు కట్టుకొని హామీలు అమలు చేస్తామన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు తనను కోసుకు తిన్నా పైసల్లేవంటున్నారని, ప్రభుత్వంలో లేకున్నా ఆయన కుటుంబ పరివారాన్ని కోేస్త కోట్లకు కోట్లు వస్తాయని బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ఎన్నికల ముందు అంతంత మాత్రంగా ఉన్న రేవంత్‌రెడ్డి అన్నదమ్ములు, బంధువర్గం ఇప్పుడు వేలకోట్లు వెనకేసుకుందన్నారు. రేవంత్‌రెడ్డి కుటుంబం అవినీతి, అరాచకాలకు పాల్పడుతోందని, వారి దోపిడీపై ఏఐసీసీ ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి అమృత్ టెండర్లు కట్టబెట్టారని, ఆయన యశోదా కంపెనీకి సింగరేణి కాంట్రాక్టులు అప్పగించారన్నారు. ప్రభుత్వ యాడ్స్ వ్యవహారం అంతా సీఎం సోదరుడు కృష్ణారెడ్డి కనుసన్నల్లో నడుస్తోందన్నారు. పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు రేవంత్ తిరిగేందుకు ల్యాండ్‌క్రూయిజర్ కారు ఇచ్చిన కె.ఎల్.ఎ్‌స.ఆర్ ఇన్ర్ఫాస్ట్రక్చర్ సంస్థకు రూ.320 కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టారని క్రిశాంక్ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News