Share News

Love Scam: సోషల్‌ మీడియాలో ప్రేమ.. మోసంతో ముగింపు!

ABN , Publish Date - May 05 , 2025 | 04:41 AM

ప్రేమ పేరుతో ఓ వ్యక్తి విదేశీ యువతిని మోసం చేశాడు. ప్రేమించానని చెప్పి మోజు తీరిన తర్వాత పత్తా లేకుండా పోయాడు. దీంతో దేశం కాని దేశంలో యువతి జీవితం తల్లకిందులైపోయింది.

Love Scam: సోషల్‌ మీడియాలో ప్రేమ.. మోసంతో ముగింపు!

  • థాయ్‌లాండ్‌ అమ్మాయి.. చెన్నై అబ్బాయి.. ప్రేమ పేరుతో మోసగించిన యువకుడు

  • సొంత దేశానికి వెళ్లేందుకు వ్యభిచారం

బంజారాహిల్స్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): ప్రేమ పేరుతో ఓ వ్యక్తి విదేశీ యువతిని మోసం చేశాడు. ప్రేమించానని చెప్పి మోజు తీరిన తర్వాత పత్తా లేకుండా పోయాడు. దీంతో దేశం కాని దేశంలో యువతి జీవితం తల్లకిందులైపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనగర్‌కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు దాడులు నిర్వహించగా.. నిర్వాహకురాలితో పాటు థాయ్‌లాండ్‌ చెందిన అమ్మాయి బెంగాల్‌కు చెందిన యువతి దొరికారు. వారిని అదుపులోకి తీసుకుని థాయ్‌లాండ్‌ అమ్మాయిని ప్రశ్నించగా ఆమె ప్రేమికుడి చేతిలో మోసపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. థాయ్‌లాండ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అమ్మాయి ఉద్యోగ అన్వేషణలో ఉండగా గతేడాది ఇన్‌స్టా లో చెన్నైకి చెందిన యువకుడితో పరిచయం ప్రేమకు దారి తీసింది.


అయితే చెన్నైకి వస్తే మొత్తం తిప్పి చూపిస్తానని నమ్మబలికాడు. దీంతో ఆమె మార్చి 15న చెన్నైకి వచ్చింది. ఓ హోటల్‌ బుక్‌ చేసుకుని ఇద్దరు కొద్ది రోజులు కలిసి ఉన్నారు. అనంతరం యువకుడు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకుని చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు. హోటల్‌ బిల్లు కూడా కట్టలేదు. యువతి వద్ద డబ్బు లేకపోవడంతో థాయ్‌లాండ్‌ స్నేహితురాలికి ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. డబ్బు పంపిస్తే తిరిగి వస్తానని తెలిపింది. దీనికి స్నేహితురాలు తన వద్ద డబ్బు లేదని హైదరాబాద్‌కు వెళ్లి తనకు తెలిసిన వారి ద్వారా వ్యభిచారం చేసి డబ్బు సంపాదించుకోవచ్చని సలహా ఇచ్చింది. హోటల్‌ నిర్వాహకులను బతిమిలాడి నగరానికి వచ్చిన యువతి శ్రీనగర్‌లో పది రోజులుగా వ్యభిచారం చేస్తూ వరకు పోలీసులకు చిక్కింది.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..

Updated Date - May 05 , 2025 | 04:41 AM