Mahesh Kumar Goud: ఆనాడు స్వాతంత్య్రం వద్దన్నవారే.. నేడు దేశాన్ని ఏలుతున్నారు: మహేశ్ గౌడ్
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:55 AM
ఆనాడు బ్రిటీష్ పాలకుల అడుగులకు మడుగులు వత్తి స్వాతంత్య్రం వద్దు, బ్రిటన్ వారే ముద్దన్న ఆర్‌ఎ్‌సఎస్ వారసులే ఈనాడు దేశాన్ని ఏలుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఆనాడు బ్రిటీష్ పాలకుల అడుగులకు మడుగులు వత్తి స్వాతంత్య్రం వద్దు, బ్రిటన్ వారే ముద్దన్న ఆర్‌ఎ్‌సఎస్ వారసులే ఈనాడు దేశాన్ని ఏలుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వారు వారి అధికారాన్ని కాపాడుకోవడం కోసం మతం, కులం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీభవన్‌లో శుక్రవారం మహేశ్‌కుమార్‌గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ వి.హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ, మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలను ప్రలోభ పెడుతూ, కార్పొరేట్లను పెంచి పోషించి పేదల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. ఓట్ల దొంగతనంతో ఆ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కులగణన సర్వే చేసి బీసీలకు 42 ు రిజర్వేషన్ బిల్లులను తీసుకురావడం ద్వారా సీఎం రేవంత్ బీసీల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని, ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. కాగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.