Share News

EPSET Counseling: వందలోపు ముగ్గురు.. వెయ్యిలోపు 187

ABN , Publish Date - Jul 20 , 2025 | 03:21 AM

ఎప్‌సెట్‌ లో టాపర్లుగా నిలిచిన చాలా మంది రాష్ట్రంలో ప్రవేశాలే తీసుకోలేదు.

EPSET Counseling: వందలోపు ముగ్గురు.. వెయ్యిలోపు 187
EPSET Counseling

  • ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌కు ర్యాంకర్లు దూరం

హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఎప్‌సెట్‌ లో టాపర్లుగా నిలిచిన చాలా మంది రాష్ట్రంలో ప్రవేశాలే తీసుకోలేదు. వారంతా జేఈఈ, ఇతర జాతీయస్థాయి పోటీ పరీక్షలు రాసి.. కేంద్ర విద్యాసంస్థల్లో చేరడంపైనే దృష్టిపెట్టారు. శుక్రవారం జరిగిన ఎప్‌సెట్‌ తొలివిడత కౌన్సెలింగ్‌లో 77,561 మందికి సీట్ల కేటాయించగా.. టాప్‌-50 ర్యాంకర్లు ఒక్కరూ లేరు. టాప్‌-100లోపు ర్యాంకులు సాధించినవారిలోనూ ముగ్గురు (ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి) మాత్రమే కౌన్సెలింగ్‌లో పాల్గొని ప్రవేశాలు పొందారు. టాప్‌-200 ర్యాంకర్లలో ఐదుగురు, టాప్‌-500లో చూస్తే 44 మందే ఉన్నారు. వెయ్యి ర్యాంకులలోపు వారిలో 187 మంది, 5వేల లోపు 2,720 మంది, 10వేల లోపు 6,409 మంది ప్రవేశాలు పొందారు. మొత్తంగా లక్షలోపు ర్యాంకు సాధించినవారిలో 59,089 మంది.. లక్ష నుంచి 1.50 లక్షల మధ్య ర్యాంకువారు 17,753 మంది సీటు సాధించారు. 1.50 లక్షలకుపైగా ర్యాంకు వచ్చినవారిలోనూ 739 మంది ప్రవేశాలు పొందారు. మొదటివిడతలో ప్రవేశాలు పొందిన 77,561 మందిలో బీసీలు 53శాతం, ఓసీలు 19.9, ఎస్సీలు 16.9, ఎస్టీలు 10.2 శాతం ఉన్నారు. ఎప్‌సెట్‌ కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన శనివారం ఈ వివరాలను విడుదల చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 03:21 AM