Local Elections: నెలాఖరుకే నోటిఫికేషన్
ABN , Publish Date - Jun 06 , 2025 | 02:46 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఖాయమైందా? పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ..
స్థానిక ఎన్నికలపై సర్కారు ముందుకే
15వ తేదీన మరోసారి క్యాబినెట్ భేటీ
అప్పుడు దీనిపై పూర్తిస్థాయిలో నిర్ణయం
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఖాయమైందా? పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెలాఖరులోపు ఎన్నికల ప్రకటన కూడా జారీ కానుందా? విశ్వసనీయవర్గాలు ఈప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. గురువారంనాడు భేటీ అయిన రాష్ట్ర మంత్రి వర్గం ఉద్యోగుల డిమాండ్లు, మెట్రో విస్తరణ, రహదారుల అభివృద్ధి సహా మొత్తం 56 కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.
స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 15న మరోసారి సమావేశం కానున్నటు.. అప్పుడు పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. అందులో భాగంగా.. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం.. వారికి 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోయే యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News