Share News

Leopard Golconda: మంచిరేవుల-గోల్కొండ మార్గంలో చిరుత సంచారం

ABN , Publish Date - Jul 30 , 2025 | 03:38 AM

మంచిరేవుల నుంచి గోల్కొండ ఆర్మీ ప్రాంతం మధ్య తిరుగుతున్న ఓ చిరుతపులి మరోసారి సీసీ కెమెరాకు చిక్కింది.

Leopard Golconda: మంచిరేవుల-గోల్కొండ మార్గంలో చిరుత సంచారం

సీసీ కెమెరాలో మరోసారి రికార్డు

నార్సింగ్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): మంచిరేవుల నుంచి గోల్కొండ ఆర్మీ ప్రాంతం మధ్య తిరుగుతున్న ఓ చిరుతపులి మరోసారి సీసీ కెమెరాకు చిక్కింది. గోల్కొండ తారామరతి మిలటరీ ప్రాంతం నుంచి పక్కనే ఉన్న అటవీ భూమిలోకి ప్రవేశిస్తుండగా, మంచిరేవుల అటవీ పార్కులోకి వెళ్లే మార్గంలో అమర్చిన సీసీ కెమెరాలో ఇది రికార్డయింది.


చిలుకూరి జింకల పార్కు, గ్రేహౌండ్స్‌ క్యాంపస్‌, పోలీస్‌ అకాడమీ, గోల్కొండ మిలటరీ కేంద్రం, మంచిరేవుల అటవీ ప్రాంతం అన్నీ కలిపి సుమారు 20 వేలు ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం అటవీ వాతావరణాన్ని పోలి ఉండడంతో చిరుత స్వేచ్ఛగా సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. చిరుతను పటుకునేందుకు పలు ప్రాంతాల్లో ఏడు బోన్లు, 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 03:38 AM