Telangana Legislative Assembly: శాసనసభ, మండలి.. ఈ సారికి వేర్వేరుగానే..!
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:28 AM
శాసనసభ, మండలి సమావేశాలను ఒకే ప్రాంగణంలో పక్కపక్కనే నిర్వహించేందుకు మరికొంత సమయం పట్టనుంది. మండలి పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తికాలేదు.
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): శాసనసభ, మండలి సమావేశాలను ఒకే ప్రాంగణంలో పక్కపక్కనే నిర్వహించేందుకు మరికొంత సమయం పట్టనుంది. మండలి పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తికాలేదు. బయటివైపు డోమ్‌ల దగ్గరి నుంచి లోపల స్పీకర్ కుర్చీ, సభ్యుల కుర్చీల వరకు పనులు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. మరమ్మతులు పూర్తయి, భవనం అందుబాటులోకి వచ్చేందుకు 4-5 నెలల సమయం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఇదీ విషయం..
అసెంబ్లీ భవనాన్ని గతంలో పబ్లిక్‌హాలు/టౌన్‌హాలు అని పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ భవనాన్ని శాసనసభ, మండలి సమావేశాల నిర్వహణకు వినియోగించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక శాసనసభ సమావేశాలను ఇందులోనే కొనసాగించగా.. మండలి సమావేశాలను జూబ్లీహాల్‌లో నిర్వహిస్తున్నారు. సీఎం, మంత్రులు ప్రత్యేకంగా అక్కడికి కార్లలో వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ హాలులోనే ఉన్న పాత భవనానికి మరమ్మతులు చేసి మండలి సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరమ్మతులు ఫిబ్రవరి 3 నాటికే పూర్తవ్వాల్సి ఉండగా.. కొనసాగుతూనే ఉన్నాయి.
రేపు కేరళకు సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం కేరళ రాష్ట్రానికి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంకా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో జరగనున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళ్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..