Share News

Hyderabad: గాజులు, చీరెలతో నిరసన తెలుపుతాం..

ABN , Publish Date - Jun 06 , 2025 | 10:09 AM

కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీ కులస్తులకు తీరని అన్యాయం చేస్తోందని ఆ సంఘం నాయకులు విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు లంబాడీలను మంత్రివర్గంలోకి తీసుకోలేదన్నారు. దీన్ని నిరసిస్తూ గాజులు, చీరెలతో నిరసన తెలుపుతామని నాయకులు తెలిపారు.

Hyderabad: గాజులు, చీరెలతో నిరసన తెలుపుతాం..

హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడీలకు స్థానం కల్పించాలని నంగారా బేరి, లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకలు డిమాండ్‌ చేశారు. మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 8న నాంపల్లి(Nampally)లోని గాంధీభవన్‌ ఎదుట చీరెలు, గాజులతో మహిళలు నిర్వహించనున్న నిరసన ప్రదర్శన, ధర్నాను విజయవంతం చేయాలని సమితి జాతీయ అధ్యక్షుడు ముడావత్‌ శ్రీనివాస్‌ నాయక్‌ పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమితి జాతీయ సమన్వయకర్త ధారావత్‌ గణేశ్‌ నాయక్‌, గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకట్‌ బంజారాతో కలిసి ఆయన మాట్లాడారు.


తమ సంస్థ పేరు వాడుకుంటున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అనంతరం సమితి రాష్ట్ర, మహిళా, యువజన విభాగం కార్యవర్గాన్ని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా అజ్మీర పూల్‌సింగ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా భూక్యా సంతోష్‌ నాయక్‌, రాష్ట్ర ఇన్‌చార్జిగా రంజిత్‌ నాయక్‌, రాష్ట్ర కన్వీనర్‌గా కె.రాజునాయక్‌, కో-కన్వీనర్‌గా పరుశురాం నాయక్‌, ప్రధాన కార్యదర్శులుగా అజ్మీర వెంకట్‌నాయక్‌, శ్రీనునాయక్‌, జలంధర్‌ నాయక్‌, సురేష్‌ నాయక్‌, బాలునాయక్‌, జైపాల్‌నాయక్‌, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్‌ నాయక్‌,


గోపాల్‌ పవార్‌, రాజునాయక్‌, హరినాయక్‌, అధికార ప్రతినిధిగా జంపన్న నాయక్‌, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా సుశీల బాయి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా పున్ని బాయి, ప్రధాన కార్యదర్శులుగా అనితాబాయి, దేవీబాయి, ఉపాధ్యక్షురాలుగా అచ్చి బాయి, సునీతాబాయి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రవి నాయక్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రమావత్‌ చిరంజీవి, ఉపాధ్యక్షుడిగా రాందాస్‌ నాయక్‌ నియమితులయ్యారు.



ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..

బనకచర్లపై ఉత్తమ్‌, కవిత తప్పుడు ప్రచారం: బక్కని

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2025 | 10:09 AM