Ayilayya: వంద ఎలుకలు తిన్న పిల్లిలా కేటీఆర్ తీరు
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:04 AM
పార్టీ పిరాయింపులపై కేటీఆర్ మాట్లాడుతుంటే.. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలు వెళ్లినట్లుగా ఉందని ..
హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): పార్టీ పిరాయింపులపై కేటీఆర్ మాట్లాడుతుంటే.. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలు వెళ్లినట్లుగా ఉందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు అత్యంత నిర్లజ్జగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేటీఆర్.. ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో 60 మందికిపైగా ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నప్పుడు వారితో ముందుకు రాజీనామా ఎందుకు చేయించలేదని ఆదివారం ఓ ప్రకటనలో నిలదీశారు. ఆనాడు కేటీఆర్‌కు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా.. అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వచ్చినా గెలిపించుకునే దమ్ము తమ సీఎం రేవంత్ రెడ్డికి ఉందన్నారు.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News