Share News

Hyderabad fire tragedy: హైదరాబాద్‌ చరిత్రలోనే విషాదకర ఘటన

ABN , Publish Date - May 20 , 2025 | 05:34 AM

గుల్జార్‌ హౌజ్‌ అగ్నిప్రమాదాన్ని తీవ్రంగా స్పందించిన కేటీఆర్‌, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రాథమిక సదుపాయాల نبودంతో ప్రాణనష్టం జరిగినదని, బాధితులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

 Hyderabad fire tragedy: హైదరాబాద్‌ చరిత్రలోనే విషాదకర ఘటన

‘గుల్జార్‌ హౌజ్‌’ ఘటనలో బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారమివ్వాలి : కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ/మదీన, మే 19(ఆంధ్రజ్యోతి): గుల్జార్‌ హౌజ్‌ అగ్నిప్రమాద ఘటన హైదరాబాద్‌ చరిత్రలోనే విషాదకరమైందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఆ కుటుంబానికి జరిగిన నష్టం భవిష్యత్తులో మరొకరికి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. 125 ఏళ్లుగా చార్మినార్‌ దగ్గర ఉంటు న్న అగర్వాల్‌ కుటుంబంలోని 17 మంది చనిపోవడం ప్రతి ఒక్కరినీ కలిచివేసిందన్నారు. ఫైరింజన్‌ నీళ్లులేకుండా వచ్చిందని, అగ్నిమాపక సిబ్బంది మాస్కులు లేకుండా రావడంతో లోపలికి వెళ్లలేకపోయారని.. అంబులెన్స్‌ల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు, మాస్కులులేవని..ఈ సదుపాయాలుంటే కొన్ని ప్రాణాలైనా దక్కేవంటూ బాధిత కుటుంబ సభ్యులు వాపోయారని తెలిపారు. అందాల పోటీలకే కాదని, ఇలాంటి సందర్భాల్లో ఉండాల్సిన మౌలిక సదుపాయలపైనా ఖర్చు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. బాధితులకు రూ.25 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ తరఫునా ఆదుకునే యత్నంచేస్తామన్నారు. కాగా, ‘ప్రభుత్వం మాకు ఏమీ చేయలేదు. ఆస్పత్రిలో మేమే సీపీఆర్‌ చేసుకున్నాం’ అని బాధిత కుటుంబ సభ్యులు కేటీఆర్‌తో చెప్పారు. అత్తాపూర్‌లో వారిని కేటీఆర్‌ పరామర్శించారు. ఈ అంశంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వెళ్లి కొట్లాడదామని బాధితులకు హామీ ఇచ్చారు.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 05:34 AM