Telangana Political Drama: కేటీఆర్.. నీది ఒక బతుకా
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:38 AM
కేటీఆర్‌కు ఏం రోగమొచ్చిందో.. మతి భ్రమించి మాట్లాడుతున్నాడంటూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు
రావుగారి రాసలీలలు బయటికొస్తే అంతే..: సంపత్
ఇప్పటికీ రక్తనమూనాలు ఎందుకివ్వలేదు?: బల్మూరి
అధికారం లేక పశువులా ప్రవర్తిస్తున్నాడు: మైనంపల్లి
హైదరాబాద్/హనుమకొండ సిటీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్‌కు ఏం రోగమొచ్చిందో.. మతి భ్రమించి మాట్లాడుతున్నాడంటూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు. ‘కేటీఆర్.. నీది ఒక బతుకా? రావు గారి రాసలీలలు చాలా ఉన్నాయి. ఇప్పటివరకు వాటిలో ఒక్క పేజీ మాత్రమే చదివాం. పాగల్, మెంటల్, క్రాక్ కలిపితే కేటీఆర్..’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కథా కమామిషు, రావుగారి రాసలీలలు, తారకుడి తోడేళ్లు వంటి పుస్తకాలను చదివితే ఆయన కుటుంబసభ్యులే చీ కొడతారన్నారు. తెలంగాణ రాజకీయాలకు మచ్చ రావొద్దనే సైలెంట్‌గా ఉంటున్నామని చెప్పారు. అమెరికాలో 3 నెలలు ఉండి డ్రగ్స్ డిటాక్స్ చేయించుకొని వచ్చి రక్త నమూనాలు ఇస్తానంటున్న కేటీఆర్.. ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. కేదార్‌తో కేటీఆర్‌కు సంబంధాలు లేకపోతే పూర్తి విచారణ చేయాలని సీఎంకు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయిన బాధలో కేటీఆర్ పశువులా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మండిపడ్డారు. మతిస్థిమితం లేని కేటీఆర్.. జీవితకాలంలో సీఎం కాలేరని విమర్శించారు. అహంకారపూరితంగా మాట్లాడుతున్న కేటీఆర్.. ఫోన్ ట్యాపింగ్‌తో సినీ, ప్రజా ప్రతినిధుల కుటుంబాల్లో చిచ్చుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి కేటీఆర్ సైకోలా ప్రవర్తిస్తున్నాడని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. సీఎంపై రోత వ్యాఖ్యలు మానుకోవాలని.. లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ‘కేటీఆర్.. నువ్వు ఎలాంటోడివో నీ చెల్లి కవితే చెప్పింది. నీది నీచ చరిత్ర. సీఎంపైనే నోరు పారేసుకుంటావా..? మరోసారి నోటికొచ్చినట్లు దూషిస్తే తాట తీస్తాం’ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. హనుమకొండలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చేలా సీఎంపై కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News