KTR: రుణం కట్టలేదని ఇంటి గేటు ఎత్తుకెళ్తారా?
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:58 AM
ఉమ్మడి రాష్ట్రంలో ఆడబిడ్డల పుస్తెలతాళ్లను అప్పుల కింద జమ చేయించిన దుష్ట చరిత్ర కాంగ్రె్‌సది అని.. అదే ఆనవాయితీని ఇప్పుడూ కొనసాగిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు.

గతంలో పుస్తెల తాళ్లను జమ చేసిన చరిత్ర కాంగ్రె్‌సది
ఇప్పుడూ అదే ఆనవాయితీ కొనసాగిస్తోంది: కేటీఆర్
హైదరాబాద్, పిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి రాష్ట్రంలో ఆడబిడ్డల పుస్తెలతాళ్లను అప్పుల కింద జమ చేయించిన దుష్ట చరిత్ర కాంగ్రె్‌సది అని.. అదే ఆనవాయితీని ఇప్పుడూ కొనసాగిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. బ్యాంకు రుణం కట్టలేదని పాడి రైతు ఇంటి గేటు ఎత్తుకెళ్తారా? ఇదేం పద్ధతి? బ్యాంకు అధికారులకు... దొంగలకు పెద్ద తేడా లేదు.. అని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. బడా బాబులకు కోట్లాది రూపాయల రుణాలను రైట్ ఆఫ్ చేస్తున్న బ్యాంకులు.. పేదల వద్దకు వచ్చే సరికి వారి రక్తం తాగుతున్నాయని విమర్శించారు. జనగామ జిల్లా ఏడునూతల గ్రామానికి చెందిన పాడి రైతు ప్రేమలత ఇంటి గేటును బ్యాంకు సిబ్బంది ఎత్తుకుపోవడంపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకరాలను రైతులు చూస్తూ ఊరుకోరని, కాంగ్రెస్ నేతలను తమ ఇంటి గేటు కూడా తొక్కనీయరని కేటీఆర్ హెచ్చరించారు.