Share News

KTR: బనకచర్లపై రాహుల్‌ మౌనం కుట్రపూరితమే!

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:58 AM

బనకచర్ల ప్రాజెక్టు అంశంపై రాహుల్‌ గాంధీ మౌనంగా ఉండటం కుట్రపూరితమేనని, తెలంగాణకు ద్రోహం చేసేందుకు ఆయన బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

KTR: బనకచర్లపై రాహుల్‌ మౌనం కుట్రపూరితమే!

  • బీజేపీతో కలిసి పని చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపణ

హైదరాబాద్‌, జూలై 3(ఆంధ్రజ్యోతి): బనకచర్ల ప్రాజెక్టు అంశంపై రాహుల్‌ గాంధీ మౌనంగా ఉండటం కుట్రపూరితమేనని, తెలంగాణకు ద్రోహం చేసేందుకు ఆయన బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఎంతపెరిగినా గొర్రెకు బెత్తడేతోక అన్నట్లు ప్రతిపక్షనేతగా రాహుల్‌ ఏడాదికాలంగా సాధించింది ఏమీలేదని ఎక్స్‌వేదికగా ఆయన ఎద్దేవా చేశారు.


గోదావరిలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి ధారాదత్తం చేస్తుంటే ఆపకుండా రాహుల్‌తోపాటు కాంగ్రెస్‌ అగ్రనాయకులు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 2014 పునర్విభజన చట్టం హామీల అమలుపై ప్రతిపక్షనేత హోదాలో రాహుల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటివరకు ప్రశ్నించలేదని కేటీఆర్‌ గుర్తుచేశారు.

Updated Date - Jul 04 , 2025 | 04:58 AM