Share News

Hyderabad: సీఎం ముఖ్యకార్యదర్శిగా కేఎస్‌ శ్రీనివాసరాజు

ABN , Publish Date - May 01 , 2025 | 03:49 AM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కేఎస్‌ శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు.

Hyderabad: సీఎం ముఖ్యకార్యదర్శిగా కేఎస్‌ శ్రీనివాసరాజు

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నియామకం.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ స్పెషల్‌ సీఎ్‌సగా శశాంక్‌ గోయెల్‌

  • డీసీఏ డీజీగా షానవాజ్‌ ఖాసీం బదిలీ

  • పీసీసీఎ్‌ఫగా సువర్ణ.. డోబ్రియాల్‌ రిటైర్డ్‌

  • రిటైర్డ్‌ కమలాసన్‌రెడ్డికి ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఓఎ్‌సడీగా బాధ్యతలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కేఎస్‌ శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఆయనతోపాటు పలువురు అఖిల భారత సర్వీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం వివిధ పోస్టుల్లో నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బుధవారం పదవీ విరమణ పొందడానికి ముందు శాంతికుమారి వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సీఎం ముఖ్యకార్యదర్శిగా నియమితుడైన శ్రీనివాసరాజు గతంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శిగా, అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (జేఈవో)గా పనిచేశారు. రాష్ట్ర విభజనతో ఆయన ఏపీకి వెళ్లగా, ఇంటర్‌ క్యాడర్‌ డిప్యుటేషన్‌లో భాగంగా 2020 మే 5న తెలంగాణకు వచ్చారు. 2024 మే 31న డిప్యుటేషన్‌ పూర్తి కావడంతో ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. అక్కడ కొద్దిరోజులకే స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. అనంతరం 2024 జూలై 1న తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు)గా నియమితులై.. ఇప్పటిదాకా కొనసాగారు. కాగా, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో పనిచేస్తున్న సంగీత సత్యనారాయణ, షానవాజ్‌ ఖాసీం బదిలీ అయ్యారు. మరో అధికారి చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఆర్‌టీఐ చీఫ్‌ కమిషనర్‌గా వెళ్లనున్నారు. ఇలా ముగ్గురు అధికారులు వెళ్లడంతో మూడు ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం శ్రీనివాసరాజును సీఎంవోలోకి తీసుకోగా.. త్వరలో మరోఅధికారిని కూడా తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.


శశాంక్‌ గోయల్‌ మళ్లీ బదిలీ..

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శశాంక్‌ గోయెల్‌ (1990 బ్యాచ్‌) మళ్లీ బదిలీ అయ్యారు. ఆదివారమే ఆయనను ఎంసీహెచ్‌ఆర్‌డీ డీజీ పోస్టు నుంచి బదిలీ చేసి.. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ) వైస్‌ చైర్మన్‌గా నియమించిన ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ(ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. అయితే బుధవారం ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేసి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. తెలంగాణ భవన్‌కు ఇప్పటికే మరో ఐఏఎస్‌ అధికారి గౌరవ్‌ ఉప్పల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. అయితే గౌరవ్‌ ఉప్పల్‌ను అక్కడే కొనసాగిస్తారా? లేక బదిలీ చేస్తారా? అన్నదానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. ఇక రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో సీఎంవోలో కార్యదర్శి హోదాలో నియమితుడైన 2003 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి షానవాజ్‌ ఖాసీంను కూడా బదిలీ చేసింది.


ఆయనను డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌(డీసీఏ) డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది. ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు డీసీఏ డీజీగా, ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా ఉన్న వీబీ కమలాసన్‌రెడ్డి బుధవారం రిటైరయ్యారు. అయితే రిటైర్‌ అయిన వెంటనే ఆయనను ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఓఎ్‌సడీగా ప్రభుత్వం నియమించింది. ఈ పోస్టులో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారని తెలిపింది. దీంతోపాటు తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా కమలాసన్‌రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావు.. మొదటి ఉత్తర్వులను కమలాసన్‌రెడ్డి నియామకంపై జారీ చేశారు. కాగా, ప్రధాన అటవీ సంరక్షణాధికారి(పీసీసీఎ్‌ఫ)గా సీనియర్‌ ఐఎ్‌ఫఎస్‌ అధికారిణి, కాంపా పీసీసీఎఫ్‌ డాక్టర్‌ సువర్ణను ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు పీసీసీఎ్‌ఫగా ఉన్న రాకేశ్‌మోహన్‌ డోబ్రియాల్‌ బుధవారం పదవీ విరమణ పొందారు.

మూసీ ఎండీ నర్సింహారెడ్డి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌ సిటీ: మూసీ రీవర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌డీసీఎల్‌) ఎండీగా ఈవీ నర్సింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.


జైళ్ల శాఖలో బదిలీలకు రంగం సిద్ధం!

తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖలో బదిలీలకు రంగం సిద్ధమైంది. కేంద్ర కారాగారాలతోపాటు, జిల్లా జైళ్ల సూపరింటెండెంట్‌లను బదిలీ చేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేశారు. పదవీ విమరణలతో ఏర్పడ్డ ఖాళీలు, ఇటీవల పదోన్నతి పొందిన అధికారులు, దీర్ఘకాలంగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్నవారు, విధినిర్వహణలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు ఉన్నారు. అన్ని అంశాల ఆధారంగా వారికి పోస్టింగ్‌ ఇచ్చేందుకు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా సిద్ధమయ్యారు. కాగా, చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ రామచంద్రం బుధవారం పదవీ విరమణ చేశారు. దీంతో చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ శివకుమార్‌కు చర్లపల్లి జైలు ఇన్‌చార్జి బాధ్యతల్ని డీజీ అప్పగించారు.


సీఎస్‌గా రామకృష్ణారావు బాధ్యతల స్వీకరణ

2.jpg

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావు బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. బుధవారం రిటైర్‌ అయిన శాంతికుమారి నుంచి ఆయన చార్జీ తీసుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని ఆరో అంతస్తులో ఇదివరకు శాంతికుమారి బాధ్యతలు నిర్వర్తించిన చాంబర్‌లోనే రామకృష్ణారావు విధులు నిర్వహించనున్నారు. రామకృష్ణారావు.. ప్రధాని నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల సీఎ్‌సలతో ‘ప్రగతి’ పేరిట ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 03:49 AM