Krishna waters: కృష్ణా జలాల పునరుద్ధరణ..
ABN , Publish Date - Oct 15 , 2025 | 07:32 AM
హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి సరఫరా చేసే కృష్ణా ఫేజ్-3 పంపింగ్‌ను అధికారులు పునరుద్ధరించారు. మరమ్మతు పనులు 30 గంటల్లోనే పూర్తి చేసి మంగళవారం మధ్యాహ్నానికి రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేశారు.
30 గంటల్లో మరమ్మతు పనులు పూర్తి
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్(Hyderabad) మహా నగరానికి తాగునీటి సరఫరా చేసే కృష్ణా ఫేజ్-3 పంపింగ్‌ను అధికారులు పునరుద్ధరించారు. మరమ్మతు పనులు 30 గంటల్లోనే పూర్తి చేసి మంగళవారం మధ్యాహ్నానికి రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేశారు. కోదండాపూర్ నుంచి గొడకొండ్ల వరకు ఉన్న మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్- 3, పంపింగ్ మెయిన్‌కి సంబంధించి 2375 ఎంఎం డయా పైప్‌లైన్‌కు భారీ నీటి లీకేజీ ఏర్పడింది.

లీకేజీని అరికట్టడంతో పాటు పనిచేయని వాల్వ్‌లను మార్చే పనుల నిమిత్తం సోమవారం ఉదయం నుంచి కృష్ణా ఫేజ్-3(Krishna Phase-3) జలాలను నిలిపివేశారు. దాదాపు 36 గంటల పాటు పనులు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి పర్యవేక్షణలో పగలు, రాత్రి లేకుండా ట్రాన్స్‌మిషన్(Transmission) విభాగం ఇంజనీర్లు, టెక్నీషియన్లు నిర్విరామంగా పనులు చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి పనులు పూర్తవ్వడంతో కృష్ణా జలాల పంపింగ్‌ను ప్రారంభించి నగరంలోని ప్రాంతాలకు నీటి సరఫరా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
షాకింగ్ .. ఎమ్‌టీవీ మ్యూజిక్ ఛానల్ మూసివేత
Read Latest Telangana News and National News