Share News

అటవీ ప్రాంత రహదారులకు ప్రాధాన్యం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ABN , Publish Date - Feb 15 , 2025 | 04:44 AM

అటవీ ప్రాంతాల్లోని రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ ప్రాంతాల్లోని రోడ్ల మరమ్మ తులను చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు.

అటవీ ప్రాంత రహదారులకు ప్రాధాన్యం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): అటవీ ప్రాంతాల్లోని రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ ప్రాంతాల్లోని రోడ్ల మరమ్మ తులను చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని రోడ్ల మరమ్మతులు, హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడల్‌ (హ్యామ్‌) రోడ్ల గుర్తింపుపై జిల్లాల సూపరింటెండెంట్‌ ఇంజనీర్లతో వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..వర్షాకాలంలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల ప్యాచ్‌ వర్కు పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.


మంద కృష్ణది ముప్పై ఏండ్ల పోరాటం

‘‘ఎస్సీల వర్గీకరణ కోసం ముప్పై ఏండ్ల పోరాటం నీది. వర్గీకరణతో పాటు, మరోవైపు పద్మ శ్రీ అవార్డును పొందావు. రెండింటికి కలిపి శుభాకాంక్షలు మిత్రమా’’ అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సచివాలయానికి వచ్చిన మంద కృష్ణ.. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కృష్ణమాదిగను.. మంత్రి శాలువా కప్పి సన్మానించారు.

Updated Date - Feb 15 , 2025 | 04:44 AM