Share News

Komatireddy Venkat Reddy: ఫాం హౌస్‌లో 14 నెలలు నిద్రపోయిన కేసీఆర్‌

ABN , Publish Date - Feb 01 , 2025 | 03:46 AM

ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన పోరాడాల్సిన మాజీ సీఎం కేసీఆర్‌ 14 నెలల పాటు ఫాం హౌస్‌లో కుంభకర్ణుడిలా నిద్రపోయాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

Komatireddy Venkat Reddy: ఫాం హౌస్‌లో 14 నెలలు నిద్రపోయిన కేసీఆర్‌

  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ, జనవరి31(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన పోరాడాల్సిన మాజీ సీఎం కేసీఆర్‌ 14 నెలల పాటు ఫాం హౌస్‌లో కుంభకర్ణుడిలా నిద్రపోయాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. నల్లగొండలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.


తెలంగాణ సాధనలో కేసీఆర్‌ పాత్ర ఏమీ లేదని, శ్రీకాంతాచారితో పాటు నాలుగున్నర కోట్ల ప్రజల పాత్ర ఉందని, కాంగ్రెస్‌ పార్టీయే తెలంగాణ ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. తండ్రిపేరు చెప్పుకుని ఒకరు, మామ పేరు చెప్పుకుని మరొకరు ఎమ్మెల్యేలు అయ్యారని కేటీఆర్‌, హరీ్‌షరావులపై ధ్వజమెత్తారు.

Updated Date - Feb 01 , 2025 | 03:46 AM