Kodandareddy Donation: సొంత భూమిని ప్రభుత్వానికిచ్చిన కోదండరెడ్డి
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:59 AM
రంగారెడ్డి జిల్లా యాచారంలో తనకున్న 2 వేల గజాల పట్టా భూమిని రాష్ట్ర వ్యవసాయ రైతు
యాచారం, జూలై 19(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా యాచారంలో తనకున్న 2 వేల గజాల పట్టా భూమిని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి ప్రభుత్వానికి అప్పగించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు శనివారం అందించారు. ఈ భూమిలో ఓ భవనం కూడా ఉందని, ప్రభుత్వం వినియోగించుకోవచ్చని మంత్రికి తెలిపారు. దాని విలువ మార్కెట్ రేట్ ప్రకారం రూ.4 కోట్లు ఉంటుందని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News