MLC Nominations: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:47 AM
రాష్ట్రంలో గవర్నర్ కోటా కింద శాసనమండలి ఎమ్మెల్సీ సభ్యుల నియామకానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు..
గవర్నర్ కోటా అభ్యర్థులుగా అధిష్ఠానం ఖరారు
హైదరాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో గవర్నర్ కోటా కింద శాసనమండలి(ఎమ్మెల్సీ) సభ్యుల నియామకానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈమేరకు ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్‌ల పేర్లను ఖరారు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ సోమవారం ఒక లేఖ విడుదల చేశారు. ఈ లేఖను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు పంపారు. గవర్నర్ కోటాలో నామినేషన్ కోసం వచ్చిన ప్రతిపాదనలను కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమోదించారని, ఈ విషయం మీ సమాచారం, తదుపరి చర్యల కోసం అని వేణుగోపాల్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News