Share News

KLH University: కేఎల్‌హెచ్‌ విద్యార్థికి రూ.75లక్షల ప్యాకేజీ

ABN , Publish Date - May 01 , 2025 | 05:16 AM

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించారని కేఎల్‌హెచ్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌ ఆకెళ్ల రామకృష్ణ తెలిపారు.

KLH University: కేఎల్‌హెచ్‌ విద్యార్థికి రూ.75లక్షల ప్యాకేజీ

  • మరికొందరికి రూ.20-50 లక్షల దాకా ప్యాకేజీలు

  • 3న సక్సెస్‌ మీట్‌: క్యాంపస్‌ డైరెక్టర్‌ ఆకెళ్ల రామకృష్ణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి) : క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించారని కేఎల్‌హెచ్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌ ఆకెళ్ల రామకృష్ణ తెలిపారు. క్యాంప్‌సలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది తమ విద్యార్థి రూ.75 లక్షల వార్షిక ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌ సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే, పలువురు విద్యార్థులు రూ. 20-50 లక్షల దాకా వేతన ప్యాకేజీలతో ఎంపికయ్యారని వివరించారు.


ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 3న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. జర్మనీ, జపాన్‌, సింగపూర్‌, దుబాయ్‌, మలేషియా వంటి దేశాల్లో పలువురికి ఉద్యోగ అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. ఇందులో గూగుల్‌, జేపీ మోర్గాన్‌తోపాటు అనేక ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారని డైరెక్టర్‌ అన్నారు.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 05:16 AM