Share News

Kishan Reddy: స్వదేశీ సాంకేతికత అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - May 12 , 2025 | 05:25 AM

స్వదేశీ సాంకేతికత ఆధారంగా ఆత్మనిర్భర్‌ భారత్‌ను నిర్మించేందుకు కొత్త ఆవిష్కరణల దిశగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: స్వదేశీ సాంకేతికత అభివృద్ధే లక్ష్యం

  • రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం కృషి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): స్వదేశీ సాంకేతికత ఆధారంగా ఆత్మనిర్భర్‌ భారత్‌ను నిర్మించేందుకు కొత్త ఆవిష్కరణల దిశగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా భారతదేశానికి అసాధారణమైన సాంకేతికతను అందించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోఖ్రాన్‌ అణు పరీక్షల వెనక ఉన్న శ్రమను కొనియాడారు. ఇది మన దేశ శాస్త్రీయ సామర్థ్యాన్ని, సంకల్పాన్ని చాటిన అసాధారణ ఘట్టమని కిషన్‌రెడ్డి ప్రశంసించారు.


తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించి రహదారుల విస్తరణ చేపట్టిందని తెలిపారు. 2014 నుంచి రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం రూ. 31,000 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 2,722 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణం, మరో 2,526 కి.మీ. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఉన్నతీకరణ చేశామని వెల్లడించారు. భవిష్యత్‌లో భారతమాల పరియోజన మొదటి దశలో రూ.38,297 కోట్ల భారీ బడ్జెట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా మరో 1,719 కి.మీ. జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని కిషన్‌రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు.


ఇవి కూడా చదవండి

Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్

Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2025 | 05:30 AM