Kishan Reddy: ప్రజా ప్రభుత్వాలను, పత్రికా స్వేచ్ఛను కూల్చివేసిన చరిత్ర కాంగ్రె్‌సది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:59 AM
రాజ్యాగం గురించి అవగాహన లేని, రాజ్యాంగం చదవని వ్యక్తి రాహుల్ గాంధీ అని, ఆయనకు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కేంద్ర మంత్రి విమర్శించారు.

హైదరాబాద్, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వాలను కూల్చివేసి, పత్రికా స్వేచ్ఛను హరించి వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. రాజ్యాగం గురించి అవగాహన లేని, రాజ్యాంగం చదవని వ్యక్తి రాహుల్ గాంధీ అని, ఆయనకు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కేంద్ర మంత్రి విమర్శించారు. శుక్రవారం భారత రత్న కర్పూరీ ఠాకూర్ జయంతి సందర్భంగాపార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మాతృభాష పరిరక్షణలో భాగంగా హిందీ భాష ప్రోత్సాహానికి ఠాకూర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. గతంలో రాజకీయ పార్టీల కనుసైగలతో పద్మ అవార్డులు వచ్చేవని, నేడు నిస్వార్థంగా దేశం కోసం పని చేసిన మహానుభావులకే అవార్డులు ఇచ్చి గౌరవించుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం