కిడ్నీరాకెట్ కేసు.. గుట్టంతా సెల్‌ఫోన్‌లోనే..!
ABN , Publish Date - Feb 03 , 2025 | 04:30 AM
అలకనంద ఆస్పత్రి కేంద్రంగా వెలుగులోకి వచ్చిన కిడ్నీ రాకెట్ కేసులో.. డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్ ఫోన్ అత్యంత కీలకమైనదిగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మంది అరెస్టవ్వగా.. వీరిలో డాక్టర్ రాజశేఖర్ ఇటీవల తమిళనాడులో పట్టుబడ్డాడు.

ఎఫ్‌ఎ్‌సఎల్‌కు డాక్టర్ ఫోన్.. ‘వాట్సాప్’ రికవరీకి యత్నాలు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): అలకనంద ఆస్పత్రి కేంద్రంగా వెలుగులోకి వచ్చిన కిడ్నీ రాకెట్ కేసులో.. డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్ ఫోన్ అత్యంత కీలకమైనదిగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మంది అరెస్టవ్వగా.. వీరిలో డాక్టర్ రాజశేఖర్ ఇటీవల తమిళనాడులో పట్టుబడ్డాడు. ప్రధాన సూత్రధారి వైజాగ్‌కు చెందిన పవన్ అలియాస్ లియోన్ అయినా.. కిడ్నీ మార్పిడి జరిపే రాజశేఖర్ ఫోన్‌లో అసలు గుట్టు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అతని ఫోన్‌లో అవయవమార్పిడి ఆపరేషన్లు చేసే వైద్యులు, వారి వివరాలు, పేషెంట్లు, దాతల సమాచారం ఉన్నట్లు భావిస్తున్నారు. ‘‘దందా వివరాలు బయటకు పొక్కకుండా రాజశేఖర్ వాట్సా్‌పనే ఉపయోగించేవాడు. ఫోన్‌కాల్స్ కూడా వాట్సా్‌పలో చేసేవాడు.
బిజినెస్ అకౌంట్ పేరుతో తన నంబర్ కనిపించకుండా చేసేవాడు. సూత్రధారులు కూడా ఇదే విధానాన్ని అనుసరించేవారు. నిర్ణీత అవయవమార్పిడి వరకు.. పేషెంట్, డోనర్, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది, డాక్టర్‌తో గ్రూప్ కాల్ చేసేవారు. ఆపరేషన్ పూర్తయ్యాక.. ఎవరివాటా వారికి ఇచ్చి, అక్కడితో కమ్యూనికేషన్‌ను ఆపేసేవారు. తదుపరి ఆపరేషన్‌కు మళ్లీ ఇదే విధానాన్ని అనుసరించేవారు. ఇప్పుడు రాజశేఖర్ వాట్సాప్ డేటాను రికవరీ చేయగలిగితే.. ఈ ముఠా గుట్టంతా బయటకు వస్తుంది’’ అని ఓ అధికారి వివరించారు. రాజశేఖర్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్(ఎ్‌ఫఎ్‌సఎల్)కు తరలించామని, అక్కడి నుంచి నివేదిక వస్తే.. దర్యాప్తు వేగవంతంగా సాగుతుందని అభిప్రాయపడ్డారు. కాగా.. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఈ ముఠా హైదరాబాద్, తమిళనాడు, శ్రీలంక, ఏపీలో 80 వరకు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లు తేలింది.