Share News

KCR Meets KT Rama Rao: ఫ్యామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కేటీఆర్‌

ABN , Publish Date - Aug 25 , 2025 | 03:55 AM

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను తనయుడు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కలిశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌ్‌సకు...

KCR Meets KT Rama Rao: ఫ్యామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కేటీఆర్‌

  • కోలుకుంటున్న బీఆర్‌ఎస్‌ చీఫ్‌.. కొనసాగుతున్న వైద్య చికిత్స

  • తాజా రాజకీయాలపై చర్చించిన నేతలు

గజ్వేల్‌/మర్కుక్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను తనయుడు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కలిశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌ్‌సకు కేటీఆర్‌ వెళ్లారు. స్వల్ప అస్వస్థతకు గురైన కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ఆయనతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వారిరువురు చర్చించినట్లు తెలిసింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చించినట్లు సమాచారం. కేసీఆర్‌ ఆరోగ్యం కాస్త కుదుటపడిందని.. షుగర్‌ లెవల్స్‌ కొంత అదుపులోకి వచ్చినట్లు తెలిసింది. వైద్య బృందం ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ చికిత్స కొనసాగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. ఫాంహౌ్‌సవద్ద భద్రతను పెంచారు. దాదాపు అర కిలోమీటర్‌ ముందు నుంచే బారికేడ్లు ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులను కూడా రానివ్వట్లేదు.


ఇవి కూడా చదవండి..

మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు

రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

రాహుల్ యాత్రలో మళ్లీ అపశృతి

For More National News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 03:55 AM